సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

జీవితగా రాధికా శరత్‌కుమార్‌

ABN, First Publish Date - 2023-02-15T00:17:43+05:30

‘పలాస 1978’ చిత్రంతో హీరోగా తొలి ప్రయత ్నంలోనే చక్కటి గుర్తింపు దక్కించుకున్నారు రక్షిత్‌ అట్లూరి. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ఆపరేషన్‌ రావణ్‌...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘పలాస 1978’ చిత్రంతో హీరోగా తొలి ప్రయత ్నంలోనే చక్కటి గుర్తింపు దక్కించుకున్నారు రక్షిత్‌ అట్లూరి. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ఆపరేషన్‌ రావణ్‌’. వెంకట సత్య దర్శకత్వంలో ధ్యాన్‌ అట్లూరి నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రంలో రాధికా శరత్‌కుమార్‌ కీలకపాత్రలో నటిస్తున్నారు. ఆమె పాత్రకు సంబంధించిన లుక్‌ను చిత్రబృందం మంగళవారం విడుదల చేసింది. ఈ సందర్భంగా రాధికా శరత్‌కుమార్‌ మాట్లాడుతూ ‘దర్శకుడు వెంకటసత్య చెప్పిన కథ నాకు బాగా నచ్చింది. దర్శకుడిగా తొలిచిత్రం అయినప్పటికీ నా పాత్రను మలిచిన తీరు బాగుంది. ఇందులో జీవిత అనే మహిళ పాత్రలో కనిపిస్తాను. నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్ర’ అని చెప్పారు. రక్షిత్‌కు జోడీగా సంగీర్తనా విపిన్‌ నటిస్తున్నారు. చరణ్‌రాజ్‌, రఘు కుంచె కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: శరవణ వాసుదేవన్‌. సినిమాటోగ్రఫీ: నాని చమిడిశెట్టి

Updated Date - 2023-02-15T00:17:45+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!