సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Radhika Sarath Kumar: ‘జీవిత’గా పలుగు పట్టిన రాధిక

ABN, First Publish Date - 2023-02-14T21:53:30+05:30

‘ఆపరేషన్ రావణ్’ (Operation Raavan) చిత్రంలో ‘జీవిత’ (Jeevitha)గా రాధికా శరత్ కుమార్ (Radhika Sarath Kumar) నటిస్తున్నారు. ఆమె పాత్రకు సంబంధించిన లుక్‌ని

Radhika Sarath Kumar in Operation Raavan
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘ఆపరేషన్ రావణ్’ (Operation Raavan) చిత్రంలో ‘జీవిత’ (Jeevitha)గా రాధికా శరత్ కుమార్ (Radhika Sarath Kumar) నటిస్తున్నారు. ఆమె పాత్రకు సంబంధించిన లుక్‌ని తాజాగా మేకర్స్ విడుదల చేశారు. ఈ లుక్‌లో ఆమె పలుగు పట్టుకుని విరోచితంగా పోరాడుతోంది. ‘పలాస 1978’ (Palasa 1978) చిత్రంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న హీరో రక్షిత్ అట్లూరి (Rakshit Atluri) నటిస్తోన్న చిత్రం ‘ఆపరేషన్ రావణ్’. ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ని ఇటీవల విడుదల చేయగా.. మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించిన రాధిక లుక్‌ను విడుదల చేసేందుకు మేకర్స్ ఓ వేడుకను నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో రాధికా శరత్ కుమార్ మాట్లాడుతూ.. స్వాతి ముత్యం, స్వాతి కిరణం వంటి అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రాల తర్వాత.. దర్శకుడు వెంకట సత్య (Venkata Satya) చెప్పిన ‘ఆపరేషన్ రావణ్’ స్క్రిప్ట్ నచ్చింది. నటనకి ప్రాధాన్యం ఉన్న ఎంతో హృద్యమైన పాత్రలో జీవితగా ఇందులో కనిపిస్తాను. దర్శకుడికి తొలి చిత్రం అయినప్పటికీ వెంకట సత్య నా పాత్రని మలిచిన తీరు, చిత్రాన్ని తీర్చిదిద్దిన విధానం నన్నెంతగానో ఆకట్టుకుంది. తెలుగుతో పాటు ఏక కాలంలో తమిళంలో విడుదలవుతున్న ఈ చిత్రంలో పని చేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. (Radhika Sarath Kumar about Operation Raavan)

కాగా.. సుధాస్ మీడియా బ్యానర్ మీద ధ్యాన్ అట్లూరి (Dhyan Atluri) నిర్మిస్తున్న ఈ న్యూ ఏజ్ ఏక్షన్-సస్పెన్స్ థ్రిల్లర్‌లో రక్షిత్ అట్లూరి సరసన సంగీర్తన విపిన్ (Sangeerthana Vipin) హీరోయిన్‌గా నటిస్తోంది. షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే తెలియజేస్తామని మేకర్స్ తెలిపారు.

Updated Date - 2023-02-14T21:53:31+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!