రచ్చ చేసే... రాంబో

ABN , First Publish Date - 2023-08-23T01:50:46+05:30 IST

శ్రీతేజ్‌ కథానాయకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ‘రాంబో’. రాజీవ్‌ సాలూరి, ఫర్నాజ్‌ శెట్టి కీలక పాత్రలు పోషిస్తున్నారు. రత్నాకరం అనిల్‌ రాజు దర్శకుడు...

రచ్చ చేసే... రాంబో

శ్రీతేజ్‌ కథానాయకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ‘రాంబో’. రాజీవ్‌ సాలూరి, ఫర్నాజ్‌ శెట్టి కీలక పాత్రలు పోషిస్తున్నారు. రత్నాకరం అనిల్‌ రాజు దర్శకుడు. శ్రీధర్‌ గంగపట్నం నిర్మాత. ఇటీవల విశాఖపట్నంలో కీలక షెడ్యూల్‌ పూర్తి చేశారు. దాంతో టాకీ ముగిసింది. మంగళవారం శ్రీతేజ్‌ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ‘రాంబో’ ఫస్ట్‌ లుక్‌ విడుదల చేశారు. ‘‘మాస్‌, కమర్షియల్‌ అంశాలతో సాగే సినిమా ఇది. ‘నారప్ప’, ‘పుష్ప’, ‘ధమాకా’ చిత్రాలలో నటుడిగా అలరించిన శ్రీతేజ్‌ ఇప్పుడు హీరోగానూ తన విశ్వరూపం చూపించబోతున్నాడ’’ని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: సునీల్‌ కశ్యప్‌.

Updated Date - 2023-08-23T01:50:46+05:30 IST