ఆధిపత్యం, అధికారం కోసం పరుగు
ABN , First Publish Date - 2023-08-11T02:38:13+05:30 IST
దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మాస్ ఎంటర్‌టైనర్ ‘కింగ్ ఆప్ కోత’. జీ స్టూడియోస్, వేఫేరర్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అభిలాష్ జోషి దర్శకత్వం వహిస్తున్నారు...

దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మాస్ ఎంటర్‌టైనర్ ‘కింగ్ ఆప్ కోత’. జీ స్టూడియోస్, వేఫేరర్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అభిలాష్ జోషి దర్శకత్వం వహిస్తున్నారు. ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్. ఈ చిత్రం ట్రైలర్‌ను నాలుగు భాషలకు చెందిన అగ్ర హీరోలు షారుఖ్ ఖాన్, మోహన్‌లాల్, నాగార్జున, సూర్య విడుదల చేశారు. ‘ఏళ్ల తర్వాత తిరిగి వచ్చిన సొంత యజమానిని చూసిన కుక్క లాంటిది ఈ కోత. ముందు అరుస్తుంది. తర్వాత తోక ఊపుకుంటూ వస్తుంది. తర్వాత కాళ్ల దగ్గర పడి ఉంటుంది’ అంటూ దుల్కర్ చెప్పిన డైలాగ్ కథలోని ఇంటెన్సిటీని సూచిస్తోంది. అధిపత్యం, అధికారం కోసం పెట్టే పరుగుని గ్రిప్పింగ్‌గా ట్రైలర్ ప్రజెంట్ చేసింది. ఇందులోని యాక్షన్ సీన్లు ప్రేక్షకులను కట్టి పడేశాయి. ఈ సినిమా గురించి దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ ‘ ఇదొక అసాధరణ ప్రయాణం. గొప్ప పాత్రలు, క్లిష్టమైన కథ, భారీ నిర్మాణ విలువలు.. కలిగిన చిత్రం. తొలిసారిగా జీ స్టూడియోతో కలసి పని ఆనందంగా ఉంది.’ అన్నారు. జీ స్టూడియోస్ సౌత్ హెడ్ అక్షయ్ కేజ్రీవాల్ మాట్లాడుతూ ‘ ఓనం సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 24న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాం. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి ఇస్తుంది. ఇదో మరుపురాని ప్రయాణం’ అన్నారు.