సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

యూనివర్సిటీ సెన్సార్‌ పూర్తి

ABN, First Publish Date - 2023-04-25T00:01:18+05:30

ప్రజానటుడు ఆర్‌. నారాయణమూర్తి తన స్నేహచిత్ర పతాకంపై స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘యూనివర్సిటీ’ చిత్రం సెన్సార్‌ పూర్తయింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రజానటుడు ఆర్‌. నారాయణమూర్తి తన స్నేహచిత్ర పతాకంపై స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘యూనివర్సిటీ’ చిత్రం సెన్సార్‌ పూర్తయింది. త్వరలో విడుదల చేస్తామని నారాయణమూర్తి చెప్పారు. తను తీసే ప్రతి చిత్రంలోనూ ఏదోక సామాజిక సమస్యను తీసుకుని దాని గురించి చర్చించడమే కాకుండా ఆ సమస్యకు పరిష్కారం చూపించడం ఆయనకు అలవాటు. అలాగే ‘యూనివర్సిటీ’ చిత్రంలో విద్యావ్యవస్థ గురించి విపులంగా చర్చించారు. ‘పదో తరగతిలో పేపరు లీకేజీలు, గ్రూప్‌ వన్‌, టు లాంటి ఉద్యోగ పరీక్షల్లోనూ పేపరు లీకేజీలు.. ఇలా అయితే విద్యార్ధుల భవిష్యత్‌ ఏం కావాలి? నిరుద్యోగుల జీవితాలు ఏమై పోవాలి? లంబకోణాలు నేర్పిన వాళ్లే కుంభకోణాలు చేస్తూ ఉంటే రెక్కలు తెగిన జ్ఞాన పావురాలు విలవిలలాడుతున్నాయి., ఊపిరాడక గింజుకుంటున్నాయి. ఈ విద్యావ్యవస్థ, ఉద్యోగ వ్యవస్థ ఇలా నిర్వీర్యం కాకూడన్నదే మా అభిమతం. మనది నిరుద్యోగ భారతం కాదు.. ఉద్యోగ భారతం కావాలి.. అని యూనివర్మిటీ చిత్రంలో చెప్పాం. అతి త్వరలో ఆడియోను విడుదల చేస్తాం’ అని తెలిపారు నారాయణమూర్తి. ఆయన ప్రొఫెసర్‌గా కీలక పాత్ర పోషించిన ఈ చిత్రానికి పాటలు: గద్దర్‌, నిస్సార్‌, మోటపలుకులు రమేశ్‌, వేల్పుల నారాయణ, ఫొటోగ్రఫీ: బాబూరావు దాస్‌, ఎడిటింగ్‌: మాలిక్‌, కథ, స్ర్కీన్‌ప్లే, మాటలు, సంగీతం, నిర్మాణం, దర్శకత్వం: ఆర్‌.నారాయణమూర్తి.

Updated Date - 2023-04-25T00:01:18+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!