Pushpa saw three times : పుష్ప మూడుసార్లు చూశా!
ABN , First Publish Date - 2023-09-15T01:09:14+05:30 IST
అల్లు అర్జున్‌కు అరుదైన ప్రశంసలు దక్కాయి. అది కూడా బాలీవుడ్ బాద్‌షా... షారుఖ్ ఖాన్ నుంచి. షారుఖ్ నటించిన ‘జవాన్’ ఇటీవలే విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా చూసిన బన్నీ ట్విట్టర్‌లో తన ప్రతి స్పందన...

అల్లు అర్జున్‌కు అరుదైన ప్రశంసలు దక్కాయి. అది కూడా బాలీవుడ్ బాద్‌షా... షారుఖ్ ఖాన్ నుంచి. షారుఖ్ నటించిన ‘జవాన్’ ఇటీవలే విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా చూసిన బన్నీ ట్విట్టర్‌లో తన ప్రతి స్పందన తెలియజేశాడు. ‘‘షారుఖ్ కెరీర్‌లో అత్యుత్తమ చిత్రమిది. ఆయన్ని ఎలా చూడాలనుకొంటున్నానో అలానే చూపించారు. షారుఖ్ తన స్టైల్‌తో దేశాన్ని ఉర్రూతలూగించారు’’ అని బన్నీ ట్వీట్ చేశారు. ఈ చిత్రానికి పనిచేసిన నయనతార, విజయ్‌సేతుపతి, అనిరుథ్‌లపై ప్రశంసల జల్లు కురిపించారు. దర్శకుడు అట్లీని ప్రత్యేకంగా అభినందించారు. దానికి షారుఖ్ ‘‘పుష్ప చిత్రాన్ని మూడు రోజుల్లో మూడుసార్లు చూశా. అల్లు అర్జున్ నటన చూసి ఎన్నో విషయాలు నేర్చుకొన్నా. వీలైనంత త్వరలో మిమ్మల్ని కలుస్తా’’ అని రీ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.