కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

గుమ్మడికాయ కొట్టేశారు

ABN, First Publish Date - 2023-08-10T04:35:10+05:30

మాస్‌ మేకర్‌ బోయపాటి శ్రీను ‘అఖండ’ ఘన విజయం తర్వాత చేస్తున్న చిత్రం ‘స్కంద’. రామ్‌ పోతినేని నటిస్తున్న ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ షూటింగ్‌ పూర్తి కావడంతో గుమ్మడికాయ కొట్టేశారు..

మాస్‌ మేకర్‌ బోయపాటి శ్రీను ‘అఖండ’ ఘన విజయం తర్వాత చేస్తున్న చిత్రం ‘స్కంద’. రామ్‌ పోతినేని నటిస్తున్న ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ షూటింగ్‌ పూర్తి కావడంతో గుమ్మడికాయ కొట్టేశారు. తన హీరోలను మునుపెన్నడూ చూడని మాస్‌ గెటప్స్‌లో చూపించడంలో నేర్పరి అయిన బోయపాటి శ్రీను ‘స్కంద’లో రామ్‌ని డిఫరెంట్‌ లుక్‌లో చూపిస్తున్నారు. హీరోయిన్‌ శ్రీలీలతో కలసి రామ్‌ ఆడిపాడిన పాటతో చిత్రనిర్మాణం పూర్తయింది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని నిర్మాత శ్రీనివాస చిట్టూరి చెప్పారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ‘స్కంద’ చిత్రం సెప్టెంబర్‌ 15న విడుదల కానుంది.

Updated Date - 2023-08-10T04:35:10+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!