పులి వస్తుంది
ABN , First Publish Date - 2023-05-16T02:12:41+05:30 IST
రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. వంశీ దర్శకుడు. సుపూర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ కథానాయికలు...

రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. వంశీ దర్శకుడు. సుపూర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ కథానాయికలు. అభిషేక్ అగర్వాల్ నిర్మాత. షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈనెల 24న ఫస్ట్ లుక్ విడుదల చేస్తున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. ‘‘1790 నేపథ్యంలో సాగే కథ. అప్పట్లో.. ‘స్టువర్టుపురం’ దొంగలకు అడ్డా. దొంగల్లో దొరలా బతికినటైగర్ నాగేశ్వరరావు కథని తెరపై చూపిస్తున్నాం. ఐదు ఎకరాల్లో స్టువర్టుపురం గ్రామాన్ని సెట్‌గా మలిచాం. టెక్నికల్‌గా ఈ సినిమా ఉన్నత స్థాయిలో ఉంటుంది. అక్టోబరు 20న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తున్నామ’’న్నారు నిర్మాత. సంగీతం: జీవీ ప్రకాశ్ కుమార్.