గల్లీ క్రికెట్‌లో పరాక్రమం

ABN , First Publish Date - 2023-08-23T01:48:09+05:30 IST

బండి సరోజ్‌కుమార్‌ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘పరాక్రమం’. ‘ఐ, మీ, మైసెల్ఫ్‌’ అనేది ట్యాగ్‌లైన్‌. అనామిక, కిరీటి కీలకపాత్రలు పోషిస్తున్నారు...

గల్లీ క్రికెట్‌లో పరాక్రమం

బండి సరోజ్‌కుమార్‌ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘పరాక్రమం’. ‘ఐ, మీ, మైసెల్ఫ్‌’ అనేది ట్యాగ్‌లైన్‌. అనామిక, కిరీటి కీలకపాత్రలు పోషిస్తున్నారు. సెప్టెంబర్‌లో చిత్రీకరణ ప్రారంభం అవనుంది. ఇటీవలే ‘పరాక్రమం’ ప్రీ టీజర్‌ను యూనిట్‌ విడుదల చేసింది. ఈ సందర్భంగా సరోజ్‌కుమార్‌ మాట్లాడుతూ ‘డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లో నటుడిగా రాణించి, ఇప్పుడు నా సొంత నిర్మాణ సంస్థ బీఎస్‌కే మెయిన్‌స్ట్రీమ్‌ ద్వారా ‘పరాక్రమం’తో వెండితెరపైకి వస్తున్నాను. గల్లీ క్రికెట్‌, రాజకీయాలు నేపథ్యంలో సాగే కథ ఇది. కుటుంబం అంతా కలసి చూసేలా సినిమా ఉంటుంది’ అన్నారు.

Updated Date - 2023-08-23T01:48:09+05:30 IST