మంచి చిత్రాన్ని ప్రోత్సహించండి

ABN , First Publish Date - 2023-09-12T00:32:20+05:30 IST

నవీన్‌ పొలిశెట్టి, అనుష్క జంటగా నటించిన ‘మిస్‌ శెట్టి.. మిస్టర్‌ పొలిశెట్టి’ చిత్రం ఘన విజయం సాధించింది. ఈ సందర్భంగా ఫిల్మ్‌ ఛాంబర్‌ అధ్యక్షుడు దిల్‌ రాజు చిత్ర యూనిట్‌ను అభినందించారు...

మంచి చిత్రాన్ని ప్రోత్సహించండి

నవీన్‌ పొలిశెట్టి, అనుష్క జంటగా నటించిన ‘మిస్‌ శెట్టి.. మిస్టర్‌ పొలిశెట్టి’ చిత్రం ఘన విజయం సాధించింది. ఈ సందర్భంగా ఫిల్మ్‌ ఛాంబర్‌ అధ్యక్షుడు దిల్‌ రాజు చిత్ర యూనిట్‌ను అభినందించారు. సోమవారం జరిగిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడుతూ ‘మంచి సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని ‘మిస్‌శెట్టి.. మిస్టర్‌ పొలిశెట్టి’తో మరోసారి రుజువైంది. మంచి చిత్రాలు వచ్చినప్పుడు వాటిని మనమంతా ఎంకరేజ్‌ చేయాలన్నది నా పాలసీ. ఒక కొత్త పాయింట్‌ను ఈ సినిమాతో ప్రేక్షకులకు చెప్పారు’ అని అభినందించారు.

దర్శకుడు మహేశ్‌బాబు మాట్లాడుతూ ‘సినిమా రిలీజ్‌కు ముందే చిరంజీవిగారు సూపర్‌హిట్‌ అని చెప్పారు. రాజమౌళిగారి ట్వీట్‌ను మళ్లీ మళ్లీ చదువుకుని సంతోషించా. అలాగే మహేశ్‌, రవితేజ, సమంత, వంశీ పైడపల్లి తదితరులు మా సినిమాను అభినందించడం ఆనందంగా ఉంది’ అన్నారు.

Updated Date - 2023-09-12T00:32:20+05:30 IST