నిర్మాత విశ్వప్రసాద్‌కు మాతృ వియోగం
ABN, First Publish Date - 2023-06-30T23:56:32+05:30
ప్రముఖ నిర్మాత, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ మాతృమూర్తి శ్రీమతి గీతాంజలి(70) శుక్రవారం సాయంత్రం శివైక్యం చెందారు.
ప్రముఖ నిర్మాత, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ మాతృమూర్తి శ్రీమతి గీతాంజలి(70) శుక్రవారం సాయంత్రం శివైక్యం చెందారు. కొంతకాలంగా అస్వస్థతతో బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతున్నారు. కోలుకోలేని పరిస్థితుల కారణంగా ఆవిడ చివరి కోరిక మేరకు విశ్వప్రసాద్ ఆమెను వారణాసి తీసుకువెళ్లారు. అక్కడ దైవ దర్శనం అనంతరం శుక్రవారం తుది శ్వాస విడిచారు. గీతాంజలికి భర్త ముగ్గురు పిల్లలు ఉన్నారు. విశ్వప్రసాద్ పెద్ద కొడుకు. వారణాసిలో ఆవిడ అంత్యక్రియలు జరుగుతాయని విశ్వప్రసాద్ చెప్పారు.