నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణకు ‘సినీ విరాట్’ బిరుదు ప్రదానం
ABN , First Publish Date - 2023-05-23T04:22:29+05:30 IST
ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణకు వంశీ ఇంటర్నేషనల్ సంస్థ ‘సినీ విరాట్’ బిరుదు ప్రదానం చేసింది. అతి తక్కువ సమయంలో వంద చిత్రాలు పూర్తి చేసిన సందర్భంగా...

ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణకు వంశీ ఇంటర్నేషనల్ సంస్థ ‘సినీ విరాట్’ బిరుదు ప్రదానం చేసింది. అతి తక్కువ సమయంలో వంద చిత్రాలు పూర్తి చేసిన సందర్భంగా ఈ పురస్కారం అందించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నటులు సుమన్, విశ్రాంత సీబీఐ అధికారి జేడీ లక్ష్మీనారాయణ, రేలంగి నరసింహారావు, ‘వంశీ’ రామరాజు తదితరులు పాల్గొన్నారు.