నిర్మాత గోగినేని ప్రసాద్ కన్నుమూత
ABN , First Publish Date - 2023-09-14T00:22:18+05:30 IST
ప్రముఖ సినీ నిర్మాత గోగినేని ప్రసాద్ (73) కన్నుమూశారు. బుధవారం సాయంత్రం హైదరాబాద్, కొండాపూర్‌లోని ఇంట్లో తుదిశ్వాస విడిచారు...

ప్రముఖ సినీ నిర్మాత గోగినేని ప్రసాద్ (73) కన్నుమూశారు. బుధవారం సాయంత్రం హైదరాబాద్, కొండాపూర్‌లోని ఇంట్లో తుదిశ్వాస విడిచారు. ‘ఈ చరిత్ర ఏ సిరాతో, శ్రీ షిరిడీ సాయిబాబా మహత్మ్యం, పల్నాటి పులి’ లాంటి విజయవంతమైన చిత్రాలను ఆయన నిర్మించారు. నేటి మధ్యాహ్నం జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.