నిర్మాతగా లోకేశ్ కనగ రాజ్
ABN , First Publish Date - 2023-11-29T00:51:33+05:30 IST
‘ఖైదీ, విక్రమ్, లియో’ చిత్రాలతో దర్శకుడిగా సంచలన విజయాలను అందుకొన్నారు లోకేశ్ కనగరాజ్. ప్రస్తుతం ఆయన రజనీకాంత్‌తో ఓ చిత్రం (తలైవర్ 171- వర్కింగ్ టైటిల్) చేస్తున్నారు...
‘ఖైదీ, విక్రమ్, లియో’ చిత్రాలతో దర్శకుడిగా సంచలన విజయాలను అందుకొన్నారు లోకేశ్ కనగరాజ్. ప్రస్తుతం ఆయన రజనీకాంత్‌తో ఓ చిత్రం (తలైవర్ 171- వర్కింగ్ టైటిల్) చేస్తున్నారు. డైరెక్టర్‌గా నిరూపించుకున్న లోకేశ్ ఇప్పుడు నిర్మాతగానూ సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. జీ స్క్వాడ్ పేరుతో సొంతంగా చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించాడు. ప్రతిభావంతులైన యువ దర్శకులకు అవకాశాలు ఇవ్వడంతో పాటు ప్రయోగాత్మక చిత్రాలకు పెద్ద పీట వేయాలనే లక్ష్యంతో ఈ బేనర్‌ను ఆరంభించినట్లు లోకేశ్ తెలిపారు. నిర్మాతగా తన తొలి చిత్రానికి సంబంధించిన వివరాలు త్వరలోనే వెల్లడిస్తానని ఆయన చెప్పారు.