ప్రేమ గోల ఎందుకురా..!

ABN , First Publish Date - 2023-08-08T03:39:14+05:30 IST

కిరణ్‌ అబ్బవరం, నేహాశెట్టి జంటగా నటించిన చిత్రం ‘రూల్స్‌ రంజన్‌’. దివ్యాంగ్‌ లవానియా, మురళీ కృష్ణ వేమూరి నిర్మాతలు...

ప్రేమ గోల ఎందుకురా..!

కిరణ్‌ అబ్బవరం, నేహాశెట్టి జంటగా నటించిన చిత్రం ‘రూల్స్‌ రంజన్‌’. దివ్యాంగ్‌ లవానియా, మురళీ కృష్ణ వేమూరి నిర్మాతలు. రత్నం కృష్ణ దర్శకుడు. ఏ.ఎం.రత్నం సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ‘ఎందుకురా బాబూ’ అనే గీతాన్ని విడుదల చేశారు. అమ్రిష్‌ గణేశ్‌ స్వరాలు అందించారు. కాసర్ల శ్యామ్‌ రాశారు. రాహుల్‌ సిప్లిగంజ్‌, రేవంత్‌ ఆలపించారు. ‘‘కథానాయకుడు ప్రేమలో విఫలమైనప్పుడు వచ్చే గీతమిది. స్నేహితులు అతనికి ధైర్యం చెబుతూ పాట అందుకొంటారు. ట్యూన్‌ క్యాచీగా ఉంది. సాహిత్యం కూడా ఆకట్టుకుంటుంది. ఇది వరకు విడుదల చేసిన రెండు పాటలకూ మంచి స్పందన వస్తోంద’’న్నారు దర్శక నిర్మాతలు. వచ్చే నెలలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.

Updated Date - 2023-08-08T03:39:14+05:30 IST