కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

‘ప్రేమ్‌ కుమార్‌’ బాగా నవ్విస్తాడు

ABN, First Publish Date - 2023-08-06T03:03:31+05:30

సంతోష్‌ శోభన్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ప్రేమ్‌ కుమార్‌’. అభిషేక్‌ మహర్షి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రాశీ సింగ్‌, రుచిత సాధినేని కథానాయికలు...

సంతోష్‌ శోభన్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ప్రేమ్‌ కుమార్‌’. అభిషేక్‌ మహర్షి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రాశీ సింగ్‌, రుచిత సాధినేని కథానాయికలు. శివ ప్రసాద్‌ పన్నీరు నిర్మాత. ఈనెల 18న విడుదల అవుతోంది. నటీనటులు, సాంకేతిక నిపుణుల పరిచయ కార్యక్రమం శనివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా సంతోష్‌ శోభన్‌ మాట్లాడుతూ ‘‘అభిషేక్‌ నా సినిమాల్లో నటించాడు. తను దర్శకుడు అవుతాడని అనుకోలేదు. కానీ ఎంత మంచి దర్శకుడయ్యాడో ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. వినోదాత్మక చిత్రాలకు తాను బ్రాండ్‌ అంబాసిడర్‌ అవుతాడ’’న్నారు. ‘‘ప్రేమ్‌ కుమార్‌ ప్రేక్షకుల్ని బాగా నవ్విస్తాడు. పాత్రలన్నీ సహజంగా ఉంటాయి. సంతోష్‌ కెరీర్‌లో ఇది మరో బెస్ట్‌ మూవీ అవుతుంద’’ని దర్శకుడు తెలిపారు.

Updated Date - 2023-08-06T03:03:31+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!