‘ప్రేమ్ కుమార్’ బాగా నవ్విస్తాడు
ABN , First Publish Date - 2023-08-06T03:03:31+05:30 IST
సంతోష్ శోభన్ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ప్రేమ్ కుమార్’. అభిషేక్ మహర్షి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రాశీ సింగ్, రుచిత సాధినేని కథానాయికలు...
సంతోష్ శోభన్ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ప్రేమ్ కుమార్’. అభిషేక్ మహర్షి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రాశీ సింగ్, రుచిత సాధినేని కథానాయికలు. శివ ప్రసాద్ పన్నీరు నిర్మాత. ఈనెల 18న విడుదల అవుతోంది. నటీనటులు, సాంకేతిక నిపుణుల పరిచయ కార్యక్రమం శనివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా సంతోష్ శోభన్ మాట్లాడుతూ ‘‘అభిషేక్ నా సినిమాల్లో నటించాడు. తను దర్శకుడు అవుతాడని అనుకోలేదు. కానీ ఎంత మంచి దర్శకుడయ్యాడో ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. వినోదాత్మక చిత్రాలకు తాను బ్రాండ్ అంబాసిడర్ అవుతాడ’’న్నారు. ‘‘ప్రేమ్ కుమార్ ప్రేక్షకుల్ని బాగా నవ్విస్తాడు. పాత్రలన్నీ సహజంగా ఉంటాయి. సంతోష్ కెరీర్‌లో ఇది మరో బెస్ట్ మూవీ అవుతుంద’’ని దర్శకుడు తెలిపారు.