ప్రకాశ్‌రాజ్‌ అర్బన్‌ నక్సలైట్‌

ABN , First Publish Date - 2023-02-10T00:14:45+05:30 IST

‘కశ్మీర్‌ ఫైల్స్‌.. అదో నాన్సెన్స్‌ ఫిల్మ్‌’ అంటూ ప్రకాశ్‌రాజ్‌ చేసిన ఘటైన విమర్శకు ఆ చిత్ర దర్శకుడు వివేక్‌ అగ్నిహోత్రి సోషల్‌ మీడియా వేదికగా స్పందించారు...

ప్రకాశ్‌రాజ్‌ అర్బన్‌ నక్సలైట్‌

వివేక్‌ అగ్నిహోత్రి ప్రతిస్పందన

‘కశ్మీర్‌ ఫైల్స్‌.. అదో నాన్సెన్స్‌ ఫిల్మ్‌’ అంటూ ప్రకాశ్‌రాజ్‌ చేసిన ఘటైన విమర్శకు ఆ చిత్ర దర్శకుడు వివేక్‌ అగ్నిహోత్రి సోషల్‌ మీడియా వేదికగా స్పందించారు. ప్రకాశ్‌రాజ్‌ను అర్బన్‌ నక్సలైట్‌గా ఆయన అభివర్ణించారు. ‘ఒక చిన్న సినిమా, జనం మెచ్చిన చిత్రం కొంతమంది అర్బన్‌ నక్సలైట్స్‌కు నిద్ర పట్టనివ్వడం లేదు. ఆ సినిమా విడుదలై సంవత్సరం అవుతున్నా వారి పిడివాదం ఇబ్బంది పెడుతూనే ఉంది. మొరిగే కుక్కల గురించి పట్టించుకోనక్కర్లేదు. ఇక నాకు ఆస్కార్‌ కాదు భాస్కర్‌ అవార్డ్‌ కూడా రాదని ఆయన అన్నారు. ఆ అవార్డ్‌ మీది అయినప్పుడు నాకు ఎలా వస్తుంది అంధరాజ్‌గారూ’ అని వ్యంగ్యంగా తన ట్వీట్‌లో పేర్కొన్నారు వివేక్‌.

Updated Date - 2023-02-10T00:14:49+05:30 IST