పురాణాల స్ఫూర్తితో...
ABN , First Publish Date - 2023-04-15T00:19:32+05:30 IST
ఆధునిక విజ్ఞానం కోణంలో పురాణ, ఇతిహాసాల ప్రాముఖ్యాన్ని తెలిపే కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రం ‘ప్రచండ తరుణం కాఠిన్య కావ్యం’ (పీటీకేకే). శుక్రవారం పూజా కార్యక్రమాలతో చిత్రీకరణ ప్రారంభమైంది.

ఆధునిక విజ్ఞానం కోణంలో పురాణ, ఇతిహాసాల ప్రాముఖ్యాన్ని తెలిపే కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రం ‘ప్రచండ తరుణం కాఠిన్య కావ్యం’ (పీటీకేకే). శుక్రవారం పూజా కార్యక్రమాలతో చిత్రీకరణ ప్రారంభమైంది. కన్నడ హీరో సిద్ధార్థ్ మహేశ్ క్లాప్ ఇచ్చారు. పరుచూరి గోపాలకృష్ణ స్ర్కిప్ట్ అందించారు. ప్రొడక్షన్ హెడ్ రాజ్యలక్ష్మి కెమెరా స్విచ్ఛాన్ చేశారు. అశోక్‌రాజ్, రితికా రాజ్, శ్రష్టి వర్మ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. బాల పొలుబోయిన దర్శకత్వంలో తెరకెక్కుతోంది. పులిచర్ల నాగరాజు, కొల్లకుంట నాగరాజు, రామచంద్ర నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా బాల మాట్లాడుతూ ‘పురాణాలను ఆధునిక విజ్ఞానానికి సమన్వయం చేస్తూ రూపొందిస్తున్న చిత్రమిది. కొత్త స్ర్కీన్‌ప్లే విధానాన్ని పరిచయం చేస్తున్నాం’ అన్నారు. మంచి కంటెంట్‌తో వస్తున్న చిత్రమిదని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: పెద్దపల్లి రోహిత్. సినిమాటోగ్రఫీ: నిరంజన్‌దాస్