చర్చల దశలో ప్రభాస్‌ సినిమా

ABN , First Publish Date - 2023-10-19T00:20:32+05:30 IST

ప్రభాస్‌ సినిమాపై చర్చలు జరుగుతున్నాయని, అవి సానుకూలంగా ముగిశాక ఈ ప్రాజెక్టుపై అధికారికంగా వెల్లడిస్తామని దర్శకుడు లోకేష్‌ కనగరాజ్‌ స్పష్టంచేశారు. ఆయన బుధవారం చెన్నైలో...

చర్చల దశలో ప్రభాస్‌ సినిమా

ప్రభాస్‌ సినిమాపై చర్చలు జరుగుతున్నాయని, అవి సానుకూలంగా ముగిశాక ఈ ప్రాజెక్టుపై అధికారికంగా వెల్లడిస్తామని దర్శకుడు లోకేష్‌ కనగరాజ్‌ స్పష్టంచేశారు. ఆయన బుధవారం చెన్నైలో విలేకరులతో మాట్లాడుతూ, ‘‘లియో’ చిత్రం తర్వాత సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ చిత్రం ప్రారంభం కానుంది. వచ్చే యేడాది ఏప్రిల్‌లో షూటింగ్‌ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత హీరో కార్తీతో ‘ఖైదీ-2’ చిత్రం ఉంటుంది. రజినీకాంత్‌ను డైరెక్ట్‌ చేయడం కంటే అదృష్టం ఇంకేముంటుంది? ఒక వీరాభిమాని రజినీకాంత్‌ను డైరెక్ట్‌ చేస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా తలైవర్‌ చిత్రం ఉంటుంది’’ అన్నారు.

ఆంధ్రజ్యోతి, చెన్నై

Updated Date - 2023-10-19T00:21:18+05:30 IST