ప్రభాస్‌ యోగి.. మరోసారి

ABN , First Publish Date - 2023-08-14T00:48:14+05:30 IST

ప్రభాస్‌ హీరోగా నటించిన ‘యోగి’ చిత్రం ఈనెల 18న రీ రిలీజ్‌ అవుతోంది. చందు ఎంటర్టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై లింగం యాదవ్‌ రీ రిలీజ్‌ చేస్తున్నారు. ఇటీవలే హైదరాబాద్‌లో రీ రిలీజ్‌ ట్రైలర్‌, పోస్టర్‌ లాంచ్‌ ఈవెంట్‌ను నిర్వహించారు...

ప్రభాస్‌ యోగి.. మరోసారి

ప్రభాస్‌ హీరోగా నటించిన ‘యోగి’ చిత్రం ఈనెల 18న రీ రిలీజ్‌ అవుతోంది. చందు ఎంటర్టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై లింగం యాదవ్‌ రీ రిలీజ్‌ చేస్తున్నారు. ఇటీవలే హైదరాబాద్‌లో రీ రిలీజ్‌ ట్రైలర్‌, పోస్టర్‌ లాంచ్‌ ఈవెంట్‌ను నిర్వహించారు. సంగీత దర్శకుడు రమణ గోగుల ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రభాస్‌, నయనతార జంటగా దర్శకుడు వి.వి వినాయక్‌ రూపొందించిన ‘యోగి’ చిత్రం 2007లో విడుదలైంది. రమణ గోగుల సంగీత సారధ్యంలో రూపొందిన పాటలు యువతను ఉర్రూతలూగించాయి. ‘చాలా కష్టపడి ‘యోగి’ చిత్రాన్ని 4కే ఫార్మాట్‌లోకి మార్చాం, నా గురువులు దిల్‌రాజు, శిరీష్‌ డిస్ట్రిబ్యూట్‌ చేస్తున్నారు’ అని లింగం యాదవ్‌ చెప్పారు.

Updated Date - 2023-08-14T00:48:38+05:30 IST