ప్రభాస్.. ప్రశాంత్ నీల్... పౌరాణిక చిత్రం
ABN , First Publish Date - 2023-04-13T03:33:21+05:30 IST
ప్రభాస్ అభిమానులకు శుభవార్త. ‘సలార్’ తర్వాత దర్శకుడు ప్రశాంత్ నీల్, ప్రభాస్ కాంబినేషన్‌లో ఓ చిత్రం రాబోతోంది. ఈ విషయాన్ని నిర్మాత దిల్‌రాజు...
ప్రభాస్ అభిమానులకు శుభవార్త. ‘సలార్’ తర్వాత దర్శకుడు ప్రశాంత్ నీల్, ప్రభాస్ కాంబినేషన్‌లో ఓ చిత్రం రాబోతోంది. ఈ విషయాన్ని నిర్మాత దిల్‌రాజు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. పౌరాణిక గాథతో ఈ చిత్రం రూపొందుతుందన్నారు. స్ర్కిప్ట్ వర్క్ కూడా పూర్తయిందని ఆయన తెలిపారు. జూనియర్ ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ చిత్రం పూర్తయ్యాక ఇది సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది. సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు తెలియాల్సి ఉంది. ‘కేజీఎఫ్’ చిత్రాలతో సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేశారు దర్శకుడు ప్రశాంత్ నీల్. వరుస పాన్ ఇండియా చిత్రాలతో జోరు చూపిస్తున్నారు ప్రభాస్. ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్‌లో ‘సలార్’ చిత్రం భారీస్థాయిలో రూపొందుతోంది.