కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

పవర్‌ ఆఫ్‌... సుబ్రహ్మణ్య

ABN, First Publish Date - 2023-10-26T01:43:32+05:30

‘బొమ్మాళీ రవిశంకర్‌’ కుమారుడు అద్వయ్‌ కథానాయకుడిగా పరిచయం అవుతున్నాడు. పి.రవిశంకర్‌ దర్శకుడు. తిరుమల్‌ శెట్టి, అనిల్‌ కడియాల నిర్మాతలు...

‘బొమ్మాళీ రవిశంకర్‌’ కుమారుడు అద్వయ్‌ కథానాయకుడిగా పరిచయం అవుతున్నాడు. పి.రవిశంకర్‌ దర్శకుడు. తిరుమల్‌ శెట్టి, అనిల్‌ కడియాల నిర్మాతలు. ఈ చిత్రానికి ‘సుబ్రహ్మణ్య’ అనే పేరు ఖరారు చేశారు. దసరా సందర్భంగా అద్వయ్‌ ఫస్ట్‌ లుక్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ‘‘డివోషనల్‌ టచ్‌ ఉన్న థ్రిల్లర్‌ ఇది. అత్యున్నత సాంకేతిక విలువలతో నిర్మిస్తున్నాం. ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులు ఈ చిత్రంలో భాగం కానున్నార’’న్నారు. కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ఏక కాలంలో రూపొందిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: రవి బస్రూర్‌, డైలాగ్స్‌: మస్తీ.

Updated Date - 2023-10-26T01:43:32+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!