Postponement of SALAAR : సలార్ వాయిదా
ABN , First Publish Date - 2023-09-14T00:39:27+05:30 IST
ప్రభాస్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘సలార్’. ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా విడుదల వాయిదా పడింది...

ప్రభాస్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘సలార్’. ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా విడుదల వాయిదా పడింది. నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ బుధవారం సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది. కొన్ని కారణాల వల్ల ముందు చెప్పిన తేదీకి ‘సలార్’ విడుదల చేయలేకపోతున్నాం, త్వరలోనే కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తామని అందులో పేర్కొంది. ‘సలార్’ చిత్రంపై ప్రేక్షకులు చూపుతున్న అభిమానానికి ఎంతో ఆనందంగా ఉంది, మంచి సినిమాను అందించడానికే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపింది. ‘సలార్’కు తుది మెరుగులు దిద్దేందుకు మా టీమ్ అంతా అవిశ్రాంతంగా పనిచేస్తోందని పేర్కొంది. ఈచిత్రంలో ప్రభాస్‌కు జోడీగా శ్రుతీహాసన్ నటిస్తున్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా నటిస్తున్నాడు. జగపతిబాబు కీలకపాత్ర పోషిస్తున్నాడు.