పొలిటికల్ కార్టూనిస్ట్
ABN , First Publish Date - 2023-07-05T02:39:49+05:30 IST
పలు తమిళ డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు హీరో శివకార్తికేయన్. ఆయన కథానాయకుడిగా రూపొందుతున్న పొలిటికల్ డ్రామా ‘మహావీరుడు’. తమిళ దర్శకుడు శంకర్ తనయ అదితి శంకర్ కథానాయికగా నటిస్తున్నారు...
పలు తమిళ డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు హీరో శివకార్తికేయన్. ఆయన కథానాయకుడిగా రూపొందుతున్న పొలిటికల్ డ్రామా ‘మహావీరుడు’. తమిళ దర్శకుడు శంకర్ తనయ అదితి శంకర్ కథానాయికగా నటిస్తున్నారు. అరుణ్ విశ్వ నిర్మిస్తున్నారు. ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రాన్ని ఏషియన్ సినిమాస్ సంస్థ తెలుగులో విడుదల చేస్తోంది. ఇటీవలే చిత్రబృందం ట్రైలర్‌ను విడుదల చేసింది. ఇందులో శివకార్తికేయన్ పొలిటికల్ కార్టూని్‌స్టగా కనిపించారు. తన వృత్తిలో రాజకీయ నాయకులతో ఆయనకు ఎదురైన అనుభవాల నేపథ్యంలో కథ సాగుతుందని తెలుస్తోంది. భిన్న చాయలున్న పాత్రలో శివ కార్తికేయన్ అద్భుతంగా నటించారు. మిస్కిన్ విలన్‌పాత్ర పోషించారు. సునీల్, యోగిబాబు, సరిత కీలకపాత్రల్లో కనిపించనున్నారు. భరత్ శంకర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: విధు అయ్యన్న