పొలిమేర 2ను ప్రేక్షకులు ఆదరించాలి
ABN , First Publish Date - 2023-11-02T02:38:05+05:30 IST
‘మా ఊరి పొలిమేర’ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న సినిమా ‘మా ఊరి పొలిమేర 2’. సత్యం రాజేశ్, కామాక్షి భాస్కర్ల, బాలాదిత్య ముఖ్యపాత్రల్లో నటించారు...

‘మా ఊరి పొలిమేర’ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న సినిమా ‘మా ఊరి పొలిమేర 2’. సత్యం రాజేశ్, కామాక్షి భాస్కర్ల, బాలాదిత్య ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ నెల 3న విడుదలవుతోంది. చిత్రబృందం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది. అడివి శేష్, నిర్మాత ఎస్‌కేఎన్ ముఖ్య అతిథులుగా పాల్గొని సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా సత్యం రాజేశ్ మాట్లాడుతూ ‘మా సినిమాను వంద కోట్ల సినిమా అంత ధైర్యంగా విడుదల చేస్తున్నామంటే దానికి కారణం వంశీ నందిపాటి. ఈ చిన్న సినిమాను ప్రేక్షకులు ఆదరించాలి’ అని కోరారు. చిత్ర దర్శకుడు డాక్టర్ అనిల్ విశ్వనాథ్ మాట్లాడుతూ ‘‘పొలిమేర 2’ చిత్రంలో బడ్జెట్ పరంగా సహకరించిన మా నిర్మాతకు థాంక్స్. ఈ సినిమా రిజల్ట్ నాకు తెలుసు. త్వరలోనే సక్సె్‌సమీట్‌లో కలుద్దాం’ అన్నారు. టీమ్ అంతా చాలా క ష్టపడి అద్భుతమైన సినిమా తీశారని చిత్ర నిర్మాత గౌరికృష్ణ తెలిపారు.