పోలీసాఫీసర్‌ రాఘవరెడ్డి

ABN , Publish Date - Dec 22 , 2023 | 05:04 AM

శివ కంఠనేని, రాశి, నందితా శ్వేత ప్రధాన తారాగణంగా రూపొందుతున్న చిత్రం ‘రాఘవరెడ్డి’. స్పేస్‌ విజన్‌ నరసింహారెడ్డి సమర్పణలో లైట్‌ హౌస్‌ సినీ మ్యూజిక్‌ బేనర్‌పై సంజీవ్‌ మేగోటి దర్శకత్వంలో...

పోలీసాఫీసర్‌ రాఘవరెడ్డి

శివ కంఠనేని, రాశి, నందితా శ్వేత ప్రధాన తారాగణంగా రూపొందుతున్న చిత్రం ‘రాఘవరెడ్డి’. స్పేస్‌ విజన్‌ నరసింహారెడ్డి సమర్పణలో లైట్‌ హౌస్‌ సినీ మ్యూజిక్‌ బేనర్‌పై సంజీవ్‌ మేగోటి దర్శకత్వంలో తెరకెక్కుతోంది. కేఎస్‌ శంకర్‌రావు, జీ రాంబాబు యాదవ్‌, ఆర్‌ వెంకటేశ్వరరావు నిర్మిస్తున్నారు. విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం ట్రైలర్‌ను మేకర్స్‌ గురువారం విడుదల చేశారు. పక్కా మాస్‌ అండ్‌ కమర్షియల్‌ ఫార్మేట్‌ ఎలిమెంట్స్‌తో ఈ చిత్రం తెరకెక్కినట్లు ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది. సిన్సియర్‌ పోలీసాఫీసర్‌ జీవితంలో వచ్చిన సమస్యలను అతను ఎలా పరిష్కరించాడు అనేది ఆసక్తికరంగా అనిపించింది. అజయ్‌, రఘుబాబు, శ్రీనివా్‌సరెడ్డి కీలకపాత్రలు పోషించారు. సంజీవ్‌ మేగోటి, సుధాకర్‌ మారియా సంగీతం అందించారు. జనవరిలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాతలు తెలిపారు.

Updated Date - Dec 22 , 2023 | 05:04 AM