సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

పోలీస్‌ భీముడు

ABN, First Publish Date - 2023-06-13T04:15:42+05:30

గోపీచంద్‌ కథానాయకుడిగా హర్ష దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. కె.కె.రాధామోహన్‌ నిర్మాత. సోమవారం గోపీచంద్‌ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఈ చిత్రం నుంచి ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ విడుదల చేస్తూ, ‘భీమా’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గోపీచంద్‌ కథానాయకుడిగా హర్ష దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. కె.కె.రాధామోహన్‌ నిర్మాత. సోమవారం గోపీచంద్‌ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఈ చిత్రం నుంచి ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ విడుదల చేస్తూ, ‘భీమా’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. గోపీచంద్‌ పోలీస్‌ అవతారంలో కనిపించనున్న చిత్రమిది. ఫస్ట్‌ లుక్‌ మాసీగా ఉంది. గోపీచంద్‌ గెటప్‌ కూడా కొత్తగా కనిపిస్తోంది. ఆయన క్యారెక్టరైజేషన్‌ ఎలా ఉండబోతోందో ఫస్ట్‌ లుక్‌తోనే చెప్పేశారు దర్శక నిర్మాతలు. ‘‘యాక్షన్‌ నేపథ్యంలో సాగే కథ ఇది. గోపీచంద్‌ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నాం. ప్రస్తుతం హైదరాబాద్‌లో యాక్షన్‌ సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నాం. త్వరలోనే కథానాయికతో పాటు మిగిలిన వివరాలు వెల్లడిస్తామ’’న్నారు నిర్మాత. సంగీతం: రవి బస్రూర్‌, కెమెరా: స్వామి జె.గౌడ, సంభాషణలు: అజ్జు మహంకాళి.

Updated Date - 2023-06-13T04:15:42+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!