మళ్లీ ఇలాంటి సినిమా చేయలేను

ABN , First Publish Date - 2023-02-11T01:27:04+05:30 IST

నాగశౌర్య, మాళవికా నాయర్‌ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’.

మళ్లీ ఇలాంటి సినిమా చేయలేను

నాగశౌర్య, మాళవికా నాయర్‌ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’. అవసరాల శ్రీనివాస్‌ దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్‌, పద్మజ దాసరి నిర్మిస్తున్నారు. నాగశౌర్య, అవసరాల శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో వస్తున్న మూడో చిత్రం ఇది. చిత్రబృందం టీజర్‌ను విడుదల చేసింది. ఓ అందమైన ప్రేమకథతో ఈ చిత్రం రూపొందినట్లు టీజర్‌ని బట్టి తెలుస్తోంది. కల్యాణి మాలిక్‌ సంగీతం టీజర్‌కు ప్రత్యేకాకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా నాగశౌర్య మాట్లాడుతూ ‘శ్రీనివాస్‌ చిత్రాల ద్వారా ప్రేక్షకులకు దగ్గరయ్యాను. ఈ సినిమాను ఆయనలా ఎవరూ తీయలేరు. నా జీవితంలో మళ్లీ ఇలాంటి సినిమా చేయలేను’ అన్నారు. శ్రీనివాస్‌ అవసరాల మాట్లాడుతూ ‘అందరం కలసి తీసిన సినిమా ఇది. సహజత్వానికి దగ్గరగా ఉంటుంది. మన చుట్టూ ఉండే మనుషుల కథలు ఈ చిత్రానికి స్ఫూర్తి’ అన్నారు. సంజయ్‌, అనుపమల ప్రేమకథతో ప్రేక్షకులకు మజా వస్తుంది అని మాళవికా నాయర్‌ అన్నారు.

Updated Date - 2023-02-11T01:27:05+05:30 IST