స్మెల్‌ బేస్డ్‌ థ్రిల్లర్‌

ABN , First Publish Date - 2023-11-18T00:24:05+05:30 IST

చేనాగ్‌, ప్రాచీ థాకర్‌ జంటగా రూపుదిద్దుకున్న ‘పెర్‌ప్యూమ్‌’ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. జీడీ స్వామి దర్శకత్వంలో జె.సుధాకర్‌, శివ, రాజీవ్‌కుమార్‌, లావూరి శ్రీనివాస్‌, రాజేంద్ర కనుకుంట్ల, శ్రీధర్‌ అక్కినేని నిర్మించారు.

స్మెల్‌ బేస్డ్‌ థ్రిల్లర్‌

చేనాగ్‌, ప్రాచీ థాకర్‌ జంటగా రూపుదిద్దుకున్న ‘పెర్‌ప్యూమ్‌’ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. జీడీ స్వామి దర్శకత్వంలో జె.సుధాకర్‌, శివ, రాజీవ్‌కుమార్‌, లావూరి శ్రీనివాస్‌, రాజేంద్ర కనుకుంట్ల, శ్రీధర్‌ అక్కినేని నిర్మించారు. గురువారం రాత్రి ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమాలో ఆస్కార్‌ అవార్డ్‌ గ్రహీత చంద్రబో్‌సను చిత్ర యూనిట్‌ సత్కరించింది. ఈ కార్యక్రమంలో హీరో చేనాగ్‌ మాట్లాడుతూ ‘స్మెల్‌ బేస్డ్‌ థ్రిల్లింగ్‌ కాన్సె్‌ప్టతో ఇంతవరకూ ఏ సినిమా రాలేదు. రెండేళ్ల క్రితం దర్శకుడు జీడీ నాకు ఈ కథ గురించి చెప్పారు. చాలా మంది దగ్గరకు వెళ్లాం. కానీ కొంతమందికి కథ అర్థం కాలేదు. చివరకు నేనే హీరో పాత్ర పోషించాను. ఈ సినిమాలో ఎన్నో లేయర్స్‌ ఉంటాయి. డార్క్‌ మోడ్‌లో నా పాత్ర ఉంటుంది.. ఇంతమంచి పాత్ర నాకు మళ్లీ దొరకదు’ అన్నారు. ‘నేను ఇప్పటివరకూ 3700 పాటలు రాశాను. తొలిసారిగా నా గురించి ఓ పాట రాయడం, పాడడం.. ఈ వేడుకలోనే జరిగింది. జేడీ ఈ సినిమాను అద్భుతంగా తెరకు ఎక్కించారు. చిత్రం విజయవంతం కావాలని కోరుకుంటున్నాను’ అన్నారు చంద్రబోస్‌. దర్శకుడు జేడీ స్వామి మాట్లాడుతూ ‘కొత్తదనం కలిగిన పాయింట్‌తో సినిమా తీస్తే మంచి ఫలితం ఉంటుంది. ఆ సుగుంధం కచ్చితంగా వ్యాపిస్తుంది. నా గురువు చంద్రబో్‌సగారే నాకు స్ఫూర్తి’ అన్నారు.

Updated Date - 2023-11-18T00:27:20+05:30 IST