కీడా కోలాను జనం బాగా ఎంజాయ్‌ చేస్తారు

ABN , First Publish Date - 2023-10-19T00:17:13+05:30 IST

‘అనుకున్న కథను బలంగా నమ్మి , ఆ కథకు, కథనానికి కట్టుబడి సినిమాలు తీసే దర్శకులు చాలా అరుదుగా ఉంటారు. వారిలో తరుణ్‌భాస్కర్‌ ఒకరు. అటువంటి దర్శకులు పరిశ్రమలో ఉండడం...

కీడా కోలాను జనం బాగా ఎంజాయ్‌ చేస్తారు

‘అనుకున్న కథను బలంగా నమ్మి , ఆ కథకు, కథనానికి కట్టుబడి సినిమాలు తీసే దర్శకులు చాలా అరుదుగా ఉంటారు. వారిలో తరుణ్‌భాస్కర్‌ ఒకరు. అటువంటి దర్శకులు పరిశ్రమలో ఉండడం ఒక గౌరవం. ఆయన తాజా చిత్రం ‘కీడా కోలా’ చూసి జనం బాగా ఎంజాయ్‌ చేస్తారు. నవంబర్‌ 3న ఈ సినిమా విడుదలవుతోంది’ అన్నారు రానా. తన సమర్పణలో తరుణ్‌భాస్కర్‌ రూపొందించిన క్రైమ్‌ కామెడీ ‘కీడా కోలా’ థియేట్రికల్‌ ట్రైలర్‌ను రానా విడుదల చేశారు. హాస్య నటుడు బ్రహ్మానందం వరదరాజుల తాతగా ఇందులో ప్రధాన పాత్ర పోషించారు. తరుణ్‌భాస్కర్‌ మాట్లాడుతూ ‘క్రైమ్‌ కామెడీ నాకు చాలా ఇష్టమైన జోనర్‌. ఈ జోనర్‌ సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ‘కీడా కోలా’ కథ రాస్తున్నప్పుడు ఈ జోనర్‌ ఎంత కష్టమైందో అర్థమైంది. సినిమా అద్భుతంగా వచ్చింది. ఈ చిత్ర నిర్మాతలు నా స్నేహితులే. రానాగారు బాగుందని స్టాంప్‌ వేస్తే చాలా మంచి వైబ్‌ వస్తుంది. సినిమా అంతా వినూత్నంగా ఉంటుంది. పాత్రలన్నీ సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తాయి. వాటిల్లోనే ఫన్‌ ఉంటుంది. ఈ సినిమా విషయంలో చాలా కాన్పిడెంట్‌గా ఉన్నాను. ప్రేక్షకులు తప్పకుండా ఎంజాయ్‌ చేస్తారు’ అన్నారు. ‘ఈ కథ విన్నప్పుడు చాలా ఎంజాయ్‌ చేశాం. ప్రతి సన్నివేశం క్రేజీగా అనిపించింది. సినిమా కూడా బాగా వచ్చింది. నవంబర్‌ 3న వస్తోంది. అందరూ థియేటర్‌లోనే చూడండి’ అన్నారు నిర్మాతలు వివేక్‌ సుధాంసు, సాయికృష్ణ గద్వాల్‌, శ్రీనివాస్‌ కౌశిక్‌, శ్రీపాద నందిరాజ్‌, ఉపేంద్ర వర్మ.

Updated Date - 2023-10-19T00:17:13+05:30 IST