పెనిమిటి వస్తాడా? రాడా?
ABN , First Publish Date - 2023-04-10T01:06:18+05:30 IST
నందిత శ్వేత నటించిన చిత్రం ‘రా..రా..పెనిమిటి’. సత్య వెంకట గద్దాడ దర్శకుడు. ప్రమీల నిర్మాత. త్వరలోనే విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ఇటీవల హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు...
నందిత శ్వేత నటించిన చిత్రం ‘రా..రా..పెనిమిటి’. సత్య వెంకట గద్దాడ దర్శకుడు. ప్రమీల నిర్మాత. త్వరలోనే విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ఇటీవల హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఒకే ఒక్క పాత్రతో ప్రయోగాత్మకంగా తెరకెక్కించిన చిత్రమిది. భర్త రాక కోసం ఓ భార్య విరహవేదనతో ఎదురు చూస్తుండడమే కథ. మరి ఆ భర్త వచ్చాడా? రాలేదా? అనేది తెరపై చూడాలి’’ అన్నారు. ‘‘దర్శకుడు ఈ కథ చెప్పినప్పుడు ఎంతో థ్రిల్ ఫీలయ్యాను. ఈ పాత్ర చేయగలనా? లేదా? అనే సందేహం వచ్చింది. కానీ దర్శకుడు చెప్పింది చేసుకొంటూ వెళ్లిపోయాను. ఈ చిత్ర విజయంపై నాకు గట్టి నమ్మకం ఏర్పడింద’’న్నారు నందిత.