కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

పెళ్లైన కొత్తలో

ABN, First Publish Date - 2023-08-07T03:38:12+05:30

చైతన్య రావు, హృతికా శ్రీనివాస్‌ జంటగా సాయి తేజ దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. ఎం.గౌతమ్‌ నిర్మాత....

చైతన్య రావు, హృతికా శ్రీనివాస్‌ జంటగా సాయి తేజ దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. ఎం.గౌతమ్‌ నిర్మాత. ఆదివారం ఉదయం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి సి.కల్యాణ్‌ క్లాప్‌ కొట్టారు. అనీల్‌ కురుమాచలం స్విచ్చాన్‌ చేశారు. బెక్కం వేణుగోపాల్‌ గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘పెళ్లైన కొత్తలో భార్యభర్తల మధ్య కొన్ని అనుకోని అపార్థాలు ఎదువుతాయి. వాటిని ఎలా హ్యాండిల్‌ చేశారు? వారిద్దరి మధ్య బంధం ఎలా బలపడింది? అనే ఆసక్తికరమైన పాయింట్‌తో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నామ’’ని చిత్రబృందం తెలిపింది.

Updated Date - 2023-08-07T03:38:12+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!