పెదకాపు పోరాటం
ABN , First Publish Date - 2023-09-05T02:18:20+05:30 IST
శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న న్యూ ఏజ్ పొలిటికల్ థ్రిల్లర్ ‘పెదకాపు 1’ ఈ నెల 29న విడుదల కానుందిజ ‘అఖండ లాంటి మాసివ్ బ్లాక్ బస్టర్‌ని అందించిన ద్వారకా క్రియేషన్స్ అధినేత మిర్యాల రవీందర్‌రెడ్డి...

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న న్యూ ఏజ్ పొలిటికల్ థ్రిల్లర్ ‘పెదకాపు 1’ ఈ నెల 29న విడుదల కానుందిజ ‘అఖండ లాంటి మాసివ్ బ్లాక్ బస్టర్‌ని అందించిన ద్వారకా క్రియేషన్స్ అధినేత మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంతో విరాట్ కర్ణ హీరోగా పరిచయమవుతున్నారు. ప్రగతి శ్రీవాస్తవ హీరోయిన్.దసరా పండగ సందర్భంగా భారీ పోటీ ఉండడంతో ఈ నెల 29 పర్ఫెక్ట్ డేట్ అని నిర్మాత భావించి, విడుదల తేదిని ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో విరాట్ యాక్షన్ ప్యాక్డ్ లుక్‌తో కనిపించారు. ‘అణిచేవేత, ఘర్షణల నేపథ్యంలో రూపొందిన చిత్రం ఇది. ఇద్దరు శక్తిమంతమైన వ్యక్తులకు వ్యతిరేకంగా హీరో చేసే పోరాటం ఆసక్తికరంగా ఉంటుంది’ అని దర్శకుడు చెప్పారు. రావు రమేశ్, నాగబాబు, తనికెళ్ల భరణి, రాజీవ్ కనకాల తదితరులు నటించిన ఈ చిత్రానికి ఛాయాగ్రాహణం: చోటా కె నాయుడు, సంగీతం: మిక్కీ జే మేయర్.