పబ్‌లో పవన్‌.. తేజూ స్టెప్పులు

ABN , First Publish Date - 2023-05-23T04:23:52+05:30 IST

పవన్‌ కల్యాణ్‌, సాయిధరమ్‌ తేజ్‌ కలిసి నటిస్తున్న చిత్రం ‘బ్రో’. తమిళంలో ఘన విజయం సాధించిన ‘వినోదాయ సీతమ్‌’కి ఇది రీమేక్‌. సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నారు. సింహభాగం చిత్రీకరణ పూర్తయింది...

పబ్‌లో పవన్‌.. తేజూ స్టెప్పులు

వన్‌ కల్యాణ్‌, సాయిధరమ్‌ తేజ్‌ కలిసి నటిస్తున్న చిత్రం ‘బ్రో’. తమిళంలో ఘన విజయం సాధించిన ‘వినోదాయ సీతమ్‌’కి ఇది రీమేక్‌. సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నారు. సింహభాగం చిత్రీకరణ పూర్తయింది. పవన్‌ పార్ట్‌ దాదాపుగా అయిపోయింది. అయితే ఓ పాట మాత్రం బాకీ ఉంది. అందుకోసం హైదరాబాద్‌లో ఓ పబ్‌ సెట్‌ వేశారు. అందులోనే ఈ పాట తెరకెక్కిస్తారు. పవన్‌ ఎప్పుడు కాల్షీట్లు ఇస్తే అప్పుడు ఈ పాట చిత్రీకరిస్తారు. ప్రస్తుతానికి సాయిధరమ్‌తేజ్‌పై కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. తేజ్‌ సరసన కేతిక శర్మ కథానాయికగా నటిస్తోంది. తమన్‌ సంగీతం సమకూరుస్తున్నారు. జులై 28న ఈ చిత్రాన్ని విడుదల చేస్తారు.

Updated Date - 2023-05-23T04:23:52+05:30 IST