సంగీత దర్శకుడిగా పవన్‌కల్యాణ్ తనయుడు
ABN , First Publish Date - 2023-04-13T03:36:20+05:30 IST
పవన్ కల్యాణ్ తనయుడు అకీరా నందన్ సంగీత దర్శకుడయ్యాడు. 19 ఏళ్ల వయసు కలిగిన అకీరా ‘రైటర్స్ బ్లాక్’ అనే ఒక లఘు చిత్రానికి సంగీతం అందించాడు...
పవన్ కల్యాణ్ తనయుడు అకీరా నందన్ సంగీత దర్శకుడయ్యాడు. 19 ఏళ్ల వయసు కలిగిన అకీరా ‘రైటర్స్ బ్లాక్’ అనే ఒక లఘు చిత్రానికి సంగీతం అందించాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా హీరో అడవి శేష్ వెల్లడించారు. ‘రైటర్స్ బ్లాక్’ షార్ట్ ఫిల్మ్ లింక్‌ను కూడా ఆయన షేర్ చేసి, యూనిట్‌కు అభినందనలు తెలిపారు. ఇంగ్లీషులో రూపుదిద్దుకొన్న ఈ లఘు చిత్రానికి కార్తికేయ యార్లగడ్డ దర్శకత్వం వహించారు. నాలుగున్నర నిమిషాల నిడివి కలిగిన ఈ ఫిల్మ్‌కు అకీరా అందించిన సంగీతం ఆకట్టుకునేలా ఉంది. అకీరాకు సంగీతం అంటే ఎంతో ఆసక్తి. అందుకే పియానో ప్లే చేయడం నేర్చుకున్నాడు. గతంలో తన స్కూల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రంలోని ‘దోస్తీ’ పాటను పియానో పై ప్లే చేసి అకీరా అందరి దృష్టినీ ఆకట్టుకున్నాడు. అడవి శేష్‌కు, అకీరాకు మధ్య ఉన్న అనుబంధం కారణంగా అకీరా సంగీత దర్శకుడైన విషయాన్ని అందరితో పంచుకున్నఆరు అడి శేష్.