పాన్ ఇండియా ప్రేమకథ
ABN , First Publish Date - 2023-08-10T04:36:32+05:30 IST
‘‘ఖుషి’ చిత్రం అద్భుతమైన ప్రేమకథతో రూపొందింది. ప్రాంతాలు, భాషలకు అతీతంగా ప్రేక్షకులను అలరిస్తుంది’ అని విజయ్ దేవరకొండ అన్నారు. ఆయన సమంతతో కలసి నటించిన చిత్ర మిది...

‘‘ఖుషి’ చిత్రం అద్భుతమైన ప్రేమకథతో రూపొందింది. ప్రాంతాలు, భాషలకు అతీతంగా ప్రేక్షకులను అలరిస్తుంది’ అని విజయ్ దేవరకొండ అన్నారు. ఆయన సమంతతో కలసి నటించిన చిత్ర మిది. శివ నిర్వాణ దర్శకుడు. నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించారు. సెప్టెంబరు 1న ప్రేక్షకుల ముందుకొస్తోంది. బుధవారం హైదరాబాద్‌లో పలు భాషల్లో ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ ‘అందరూ పాన్ ఇండియా స్థాయిలో యాక్షన్ సినిమాలు చేస్తుంటే మేం ప్రేమకథతో పాన్ ఇండియా ప్రయత్నం చేస్తున్నాం. మన సంప్రదాయాలు, కుటుంబ బంధాలు, వివాహ వ్యవస్థ లాంటి అంశాలతో ముడిపడిన కథ ఇది. ‘ఖుషి’ కథ విన్నాక మళ్లీ ప్రేమకథల్లో నటించాలనే ఆసక్తి కలిగింది. ఎన్ని ఇబ్బందులు పడినా సమంత సినిమా పూర్తి చేశారు’ అన్నారు. శివ నిర్వాణ మాట్లాడుతూ ‘దేశంలోని అనేక అందమైన ప్రదేశాల్లో షూటింగ్ చేశాం. ఈ సినిమాతో ప్రేక్షకులపై నాకున్న ప్రేమను చూపించబోతున్నా. ఈ సినిమాలో లవ్, సెలబ్రేషన్ ఉంటాయి’ అని చెప్పారు. ఆగస్టు 15న గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ వేడుక చేస్తామని నవీన్ యెర్నేని చెప్పారు.