పల్లి పల్లి బెల్లంపల్లి

ABN , First Publish Date - 2023-03-01T01:03:21+05:30 IST

ఉపేంద్ర హీరోగా నటిస్తోన్న పాన్‌ ఇండియా చిత్రం ‘కబ్జ’. ఆర్‌. చంద్రు దర్శకుడు. పునీత్‌ రాజ్‌కుమార్‌ జయంతి సందర్భంగా ఈ నెల 17న పలు భాషల్లో విడుదలవుతోంది...

పల్లి పల్లి బెల్లంపల్లి

ఉపేంద్ర హీరోగా నటిస్తోన్న పాన్‌ ఇండియా చిత్రం ‘కబ్జ’. ఆర్‌. చంద్రు దర్శకుడు. పునీత్‌ రాజ్‌కుమార్‌ జయంతి సందర్భంగా ఈ నెల 17న పలు భాషల్లో విడుదలవుతోంది. చిత్రబృందం ప్రచార కార్యక్రమాల్లో వేగం పెంచింది. ‘కబ్జ’ నుంచి ‘పల్లి పల్లి బెల్లం పల్లి’ అంటూ సాగే గీతాన్ని శివరాజ్‌కుమార్‌ మంగళవారం విడుదల చేసి, సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ మాస్‌ గీతానికి చంద్రబోస్‌ సాహిత్యం అందించగా, రవి బస్రూర్‌ స్వరకల్పన చేశారు. హరిణీ, సంతోష్‌ వెంకీ ఆలపించారు. ఇప్పటిదాకా ‘కబ్జ’ కథ గురించి బయటకు చెప్పలేదు, అదే ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ అని ఉపేంద్ర అన్నారు.

Updated Date - 2023-03-01T01:03:23+05:30 IST