ధనుష్‌తో జోడీ కుదిరింది

ABN , First Publish Date - 2023-08-15T03:03:07+05:30 IST

ధనుష్‌ కథానాయకుడిగా శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే. సునీల్‌ నారంగ్‌, పుస్కుర్‌ రామ్‌ మోహన్‌ రావు నిర్మాతలు. ఈ చిత్రంలో కథానాయికగా...

ధనుష్‌తో జోడీ కుదిరింది

ధనుష్‌ కథానాయకుడిగా శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే. సునీల్‌ నారంగ్‌, పుస్కుర్‌ రామ్‌ మోహన్‌ రావు నిర్మాతలు. ఈ చిత్రంలో కథానాయికగా రష్మికని ఎంచుకొన్నారు. ధను్‌షతో రష్మిక జోడీ కట్టడం ఇదే తొలిసారి. శేఖర్‌ కమ్ముల చిత్రంలో కథానాయిక పాత్రలకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. ఈసారీ.. చాలా బలమైన క్యారెక్టర్‌ రాసుకొన్నారని, అందులో రష్మిక లాంటి స్టార్‌ ఉంటే బాగుంటుందని శేఖర్‌ కమ్ముల భావించారని, అందుకే రష్మిక ఈ టీమ్‌లోకి వచ్చారని చిత్రబృందం తెలిపింది.

Updated Date - 2023-08-15T03:03:07+05:30 IST