మా కాంబినేషన్ సరదాగా ఉంటుంది
ABN , First Publish Date - 2023-03-29T02:34:36+05:30 IST
‘తెలుగు సినిమా చేయాలనే కోరిక ‘మీటర్’తో నెరవేరింది. ఇందులో నా పాత్ర కొత్త తరహాలో ఉంటుంది. సీరియ్‌సగా ఉంటూ ప్రేక్షకులను నవ్విస్తుంది’ అని అతుల్య రవి అన్నారు...

‘తెలుగు సినిమా చేయాలనే కోరిక ‘మీటర్’తో నెరవేరింది. ఇందులో నా పాత్ర కొత్త తరహాలో ఉంటుంది. సీరియ్‌సగా ఉంటూ ప్రేక్షకులను నవ్విస్తుంది’ అని అతుల్య రవి అన్నారు. ఆమె ఈ చిత్రంలో కిరణ్ అబ్బవరంకు జోడీగా నటించారు. రమేశ్ కడూరి దర్శకుడు. ఏప్రిల్ 7న విడుదలవుతోన్న సందర్భంగా అతుల్య రవి మీడియాతో మాట్లాడారు.
‘మీటర్’ చిత్రంలో ప్రథమార్థంలో నాపైన సాగే సన్నివేశాలు ఎంటర్టైనింగ్‌గా ఉంటాయి. కిరణ్‌కు నాకూ నడుమ వచ్చే కాంబినేషన్ సీన్స్ సరదాగా ఉంటాయి.
ఇదొక పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్. అద్భుతమైన ఎమోషన్ ్సతో పాటు రొమాన్స్, పాటలు అన్నీ బావుంటాయి. తండ్రి సెంటిమెంట్ సినిమాకు కీలకం. మున్ముందు మంచి ప్రేమకథలతో పాటు ప్రయోగాత్మక పాత్రల్లో నటించాలనుంది.