‘ఓరి వారి...’ మళ్లీ మళ్లీ వినాలనిపించే పాట

ABN , First Publish Date - 2023-02-14T03:16:57+05:30 IST

‘ఓరి వారి’ విజువల్‌గా నా కెరీర్‌లోనే బెస్ట్‌ సాంగ్‌. నా మనసుకు దగ్గరైన పాట.నేను నమ్మే విలువలకూ దగ్గరగా ఉంది’ అని నాని అన్నారు. ఆయన హీరోగా నటించిన చిత్రం ‘దసరా’...

‘ఓరి వారి...’ మళ్లీ మళ్లీ వినాలనిపించే పాట

‘ఓరి వారి’ విజువల్‌గా నా కెరీర్‌లోనే బెస్ట్‌ సాంగ్‌. నా మనసుకు దగ్గరైన పాట.నేను నమ్మే విలువలకూ దగ్గరగా ఉంది’ అని నాని అన్నారు. ఆయన హీరోగా నటించిన చిత్రం ‘దసరా’. కీర్తి సురేశ్‌ కథానాయిక. శ్రీకాంత్‌ ఓదెల దర్శకుడు. సుధాకర్‌ చెరుకూరి నిర్మాత. మార్చి 30న విడుదలవుతోంది. ఈ చిత్రం నుంచి ‘ఓరి వారి’ అంటూ సాగే గీతాన్ని యూనిట్‌ సోమవారం విడుదల చేసింది. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ ‘ప్రేమించిన అమ్మాయి ఇక మనది కాదు అని తె లిసిన తర్వాత కాసేపు బాధపడి ‘ఓరివారి’ లాంటి పాటలు వినాలి. శ్రీమణి అద్భుతంగా రాశారు. సంతోష్‌ నారాయణ్‌ మంచి బాణీలు ఇచ్చారు. వినే కొద్ది వినాలనిపించే పాట ఇది. నెలల తరబడి నా చెవుల్లో మార్మోగుతోంది. ప్రేక్షకులను కూడా అమితంగా ఆకట్టుకుంటుంది. ‘దసరా’ అందరం సెలబ్రేట్‌ చేసుకునే సినిమా’ అన్నారు. శ్రీకాంత్‌ ఓదెల మాట్లాడుతూ ‘మన మూలాలను గుర్తు చేసే సహజమైన కథతో ‘దసరా’ తెరకెక్కించాం. మా ఊళ్లో జరిగిన కొన్ని సంఘటనలు దీనికి స్ఫూర్తి. తన పాత్రలో వైవిధ్యం చూపేందుకు నాని చాలా కష్టపడ్డార’ని చెప్పారు.

Updated Date - 2023-02-14T03:16:57+05:30 IST