ఆపరేషన్‌ పూర్తి

ABN , First Publish Date - 2023-10-20T02:45:32+05:30 IST

యథార్థ సంఘటన స్పూర్తితో వరుణ్‌తేజ్‌ హీరోగా తెలుగు, హిందీ భాషల్లో రూపుదిద్దుకుంటున్న ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ చిత్రం షూటింగ్‌ పూర్తయింది. వరుణ్‌తేజ్‌ ఇందులో ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ పైలెట్‌గా నటిస్తున్నారు...

ఆపరేషన్‌ పూర్తి

యథార్థ సంఘటన స్పూర్తితో వరుణ్‌తేజ్‌ హీరోగా తెలుగు, హిందీ భాషల్లో రూపుదిద్దుకుంటున్న ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ చిత్రం షూటింగ్‌ పూర్తయింది. వరుణ్‌తేజ్‌ ఇందులో ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ పైలెట్‌గా నటిస్తున్నారు. ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌ షూటింగ్‌ పూర్తి’ అని రాసి ఉన్న పోస్టర్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. మానుషి చిల్లర్‌ ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్‌గా పరిచయమవుతున్నారు. ఇందులో ఆమె రాడార్‌ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. నవదీప్‌ కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. వైమానిక దాడులు జరిగినప్పుడు మన వైమానిక దళం ఎదుర్కొనే సవాళ్లను ఈ చిత్రంలో చూపిస్తున్నారు. 2022లో వచ్చిన ‘మేజర్‌’ భారీ విజయం తర్వాత సోనీ పిక్చర్స్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి యాడ్‌ ఫిల్మ్‌ మేకర్‌, సినిమాటోగ్రాఫర్‌, వీఎఫ్‌ఎక్స్‌ నిపుణుడు శక్తి ప్రతాప్‌సింగ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతున్న ఈ చిత్రాన్ని డిసెంబర్‌ 8న విడుదల చేస్తారు.

Updated Date - 2023-10-20T02:46:00+05:30 IST