ఓహో.. గులాబీ బాల

ABN , First Publish Date - 2023-11-28T06:22:43+05:30 IST

నందమూరి కల్యాణ్‌ రామ్‌ కథానాయకుడిగా నటిస్తున్న పిరియాడిక్‌ స్పై థ్రిల్లర్‌ ‘డెవిల్‌’. ది బ్రిటీష్‌ సీక్రెట్‌ ఏజెంట్‌ అనేది ఉపశీర్షిక. అభిషేక్‌ పిక్చర్స్‌ పతాకంపై..

ఓహో.. గులాబీ బాల

నందమూరి కల్యాణ్‌ రామ్‌ కథానాయకుడిగా నటిస్తున్న పిరియాడిక్‌ స్పై థ్రిల్లర్‌ ‘డెవిల్‌’. ది బ్రిటీష్‌ సీక్రెట్‌ ఏజెంట్‌ అనేది ఉపశీర్షిక. అభిషేక్‌ పిక్చర్స్‌ పతాకంపై అభిషేక్‌ నామా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ‘దిస్‌ ఈజ్‌ లేడీ రోజ్‌’ అనే గీతాన్ని సోమవారం విడుదల చేశారు. హర్షవర్థన్‌ రామేశ్వర్‌ సంగీతాన్ని అందించారు. శ్రీహర్ష ఇమాని రాశారు. రాజకుమార్‌ ఆలపించారు. బాలీవుడ్‌ కథానాయిక ఎల్నాజ్‌ నోరౌజీ ఈ పాటలో ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతున్నారు. శ్రీకాంత్‌ విస్సా ఈ చిత్రానికి కథ, మాటలు అందించారు. ‘‘కథలో కీలకమైన తరుణంలో వచ్చే పాట ఇది. రంగుల హరివిల్లులా ఈ పాటని తీర్చిదిద్దాం’’ అని చిత్రబృందం తెలిపింది.

Updated Date - 2023-11-28T06:22:45+05:30 IST