మహేశ్‌ బాటలో... గౌతమ్‌

ABN , First Publish Date - 2023-08-30T04:58:49+05:30 IST

సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు సినిమాలు, ఫ్యామిలీ అంటూ ఎంత బిజీగా ఉన్నా.. కొంత సమయాన్ని సామాజిక సేవ కోసం కేటాయిస్తారు. చిన్నారుల గుండె ఆపరేషన్ల కోసం మహేశ్‌ శ్రమిస్తున్న సంగతి తెలిసిందే...

మహేశ్‌ బాటలో... గౌతమ్‌

సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు సినిమాలు, ఫ్యామిలీ అంటూ ఎంత బిజీగా ఉన్నా.. కొంత సమయాన్ని సామాజిక సేవ కోసం కేటాయిస్తారు. చిన్నారుల గుండె ఆపరేషన్ల కోసం మహేశ్‌ శ్రమిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన బాటలోనే సితార, గౌతమ్‌ కూడా సమాజానికి తమ వంతు సేవ చేస్తున్నారు. ఇటీవల సితార తన పుట్టిన రోజు సందర్భంగా కొంతమంది విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేసింది. ఇప్పుడు గౌతమ్‌ వంతు వచ్చింది. సోమవారం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లాడు గౌతమ్‌. అక్కడ గుండె ఆపరేషన్‌ చేయించుకొన్న కొంతమంది పిల్లల్ని పరామర్శించాడు. వాళ్లతో కొంత సమయం గడిపాడు. బహుమతులూ అందించి ఆశ్చర్యపరిచాడు. గౌతమ్‌ని చూస్తుంటే గర్వంగా ఉందని ఇన్‌స్టాలో ఓ ఎమోషన్‌ పోస్ట్‌ పెట్టారు నమ్రతా శిరోద్కర్‌.

Updated Date - 2023-08-30T04:58:49+05:30 IST