పుట్టిన రోజున ఓజీ అప్‌డేట్‌

ABN , First Publish Date - 2023-08-11T02:41:18+05:30 IST

పవన్‌ కల్యాణ్‌ హీరోగా నటిస్తున్న ‘ఓజీ’ చిత్రం నుంచి ఆసక్తికర అప్‌డేట్‌ వచ్చింది. ఆయన పుట్టిన రోజు సందర్భంగా సెప్టెంబర్‌ 2న ఈ చిత్రం నుంచి ఓ స్పెషల్‌ అప్‌డేట్‌ ఇవ్వబోతున్నట్లు...

పుట్టిన రోజున ఓజీ అప్‌డేట్‌

పవన్‌ కల్యాణ్‌ హీరోగా నటిస్తున్న ‘ఓజీ’ చిత్రం నుంచి ఆసక్తికర అప్‌డేట్‌ వచ్చింది. ఆయన పుట్టిన రోజు సందర్భంగా సెప్టెంబర్‌ 2న ఈ చిత్రం నుంచి ఓ స్పెషల్‌ అప్‌డేట్‌ ఇవ్వబోతున్నట్లు గురువారం యూనిట్‌ ప్రకటించింది. ఈ విషయాన్ని తెలుపుతూ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. అందులో ఓ భీకరమైన గ్యాంగ్‌వార్‌లో శత్రువులతో తలపడి చంపాక తన అనుచరులతో కలసి పవన్‌ కల్యాణ్‌ వెళ్తున్న దృశ్యం ఆసక్తిని పెంచింది. హీట్‌వేవ్‌ను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రంలో ప్రియా అరుళ్‌ మోహన్‌ కథానాయిక. సుజీత్‌ దర్శకత్వం వహిస్తున్నాడు.

Updated Date - 2023-08-11T02:41:18+05:30 IST