ఓ మధు.. నీ ప్రేమలో

ABN , First Publish Date - 2023-09-24T02:17:34+05:30 IST

నవీన్‌ చంద్ర, స్వాతి రెడ్డి, శ్రేయ నవిలే ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘మంత్‌ ఆఫ్‌ మధు’. శ్రీకాంత్‌ నాగోతి దర్శకుడు. యశ్వంత్‌ మలుకుట్ల నిర్మాత...

ఓ మధు.. నీ ప్రేమలో

నవీన్‌ చంద్ర, స్వాతి రెడ్డి, శ్రేయ నవిలే ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘మంత్‌ ఆఫ్‌ మధు’. శ్రీకాంత్‌ నాగోతి దర్శకుడు. యశ్వంత్‌ మలుకుట్ల నిర్మాత. అక్టోబరు 6న విడుదల కానుంది. శనివారం ఈ చిత్రం నుంచి ‘ఓ మధు’ అనే గీతాన్ని శనివారం ఆవిష్కరించారు. అచ్చు రాజమణి స్వర పరచిన గీతమిది. కార్తిక్‌, యామిని పాడారు. శ్రీకాంత్‌ నాగోతి రాశారు. ‘‘హృద్యమైన కథ ఇది. కథనం ఆకట్టుకొంటుంది. ప్రతి పాత్ర గుర్తుండిపోతుంది. నవీన్‌ చంద్ర, స్వాతిల కెమిస్ర్టీ ఈ పాటకు ప్రధాన ఆకర్షణ’’ అని దర్శకుడు తెలిపారు.

Updated Date - 2023-09-24T02:17:34+05:30 IST