O gaju bomma.. Muripala komma : ఓ గాజు బొమ్మ.. మురిపాల కొమ్మ

ABN , First Publish Date - 2023-10-04T02:06:18+05:30 IST

నాని కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘హాయ్‌ నాన్న’. మృణాల్‌ ఠాకూర్‌ కథానాయిక. బేబీ కియారా కీలక పాత్రధారి. శౌర్యువ్‌ దర్శకత్వం వహించారు. మోహన్‌ చెరుకూరి, విజయేందర్‌ రెడ్డి నిర్మాతలు...

O gaju bomma.. Muripala komma : ఓ గాజు బొమ్మ.. మురిపాల కొమ్మ

నాని కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘హాయ్‌ నాన్న’. మృణాల్‌ ఠాకూర్‌ కథానాయిక. బేబీ కియారా కీలక పాత్రధారి. శౌర్యువ్‌ దర్శకత్వం వహించారు. మోహన్‌ చెరుకూరి, విజయేందర్‌ రెడ్డి నిర్మాతలు. ఈనెల 6న ‘గాజు బొమ్మ’ అనే పాటని విడుదల చేస్తున్నారు. తండ్రీ కూతుర్ల అనుబంధం నేపథ్యంలో సాగే పాట ఇది. ‘‘హేషమ్‌ అబ్దుల్‌ వాహబ్‌ చక్కటి స్వరాలు అందించారు. తొలి పాటకు మంచి స్పందన వచ్చింది. ‘గాజుబొమ్మ’ పాట కూడా ఆకట్టుకొంటుంది. ‘హాయ్‌ నాన్న’ కథకి సోల్‌ లాంటి పాట ఇది. డిసెంబరు 21న పాన్‌ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నామ’’ని నిర్మాతలు తెలిపారు.

Updated Date - 2023-10-04T02:06:18+05:30 IST