NTR in action mode : యాక్షన్ మోడ్‌లో ఎన్టీఆర్
ABN , First Publish Date - 2023-05-17T04:00:44+05:30 IST
ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ కథానాయిక. సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు..

ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ కథానాయిక. సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రం పట్టాలెక్కింది. కొంత మేర షూటింగ్ కూడా జరిగింది. ప్రస్తుతం చిత్ర బృందం స్వల్ప విరామం తీసుకొంది. వచ్చే వారంలో మరో కీలకమైన షెడ్యూల్ మొదలు కానుంది. 10 రోజుల పాటు జరిగే ఈ షెడ్యూల్‌లో ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్‌ని రూపొందిస్తారని టాక్. ఇందుకోసం హైదరాబాద్ శివర్లలో ఓ ప్రత్యేకమైన సెట్‌ని రూపొందిస్తున్నారు. సైఫ్ అలీఖాన్ కూడా ఈ యాక్షన్ సీక్వెన్స్‌లో పాలు పంచుకొంటారని టాక్. ఈ సినిమా టైటిల్ ఏంటన్నది ఇప్పటి వరకూ ప్రకటించలేదు. కొరటాల శివ మంచి టైటిల్ కోసం అన్వేషిస్తున్నారని ఓ మంచి ముహూర్తం చూసుకొని, టైటిల్‌ని అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన ఆసక్తికరమైన అప్ డేట్ ఇవ్వడానికి దర్శక నిర్మాతలు సమాయాత్తం అవుతున్నారని టాక్. మరి ఆ అప్ డేట్ ఏమిటో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.