2024లో ఎన్టీఆర్‌ 30

ABN , First Publish Date - 2023-01-02T03:28:17+05:30 IST

ఎన్టీఆర్‌ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్‌కు ఇది 30వ చిత్రం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌...

2024లో ఎన్టీఆర్‌ 30

ఎన్టీఆర్‌ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్‌కు ఇది 30వ చిత్రం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. ఫిబ్రవరి నుంచి సెట్స్‌పైకి వెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కొత్త సంవత్సరం సందర్భంగా ఈ చిత్రం విడుదల తేదీని తెలుపుతూ ప్రత్యేక వీడియోను చిత్రబృందం వదిలింది. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 5న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ‘అప్పుడప్పుడు ధైర్యానికి కూడా తెలియదు అవసరానికి మించి తను ఉండకూడదు అని, అప్పుడు భయానికి తెలియాలి, తను రావాల్సిన సమయం వచ్చిందని, వస్తున్నా..’ అంటూ ఆయన చెప్పిన డైలాగ్‌ అలరించింది. ఈ చిత్రానికి అనిరుధ్‌ సంగీతం అందిస్తున్నారు. కల్యాణ్‌రామ్‌ సమర్పణలో నందమూరి తారకరామారావు ఆర్ట్స్‌, యువసుధ ఆర్ట్స్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

Updated Date - 2023-01-02T03:28:17+05:30 IST

Read more