Bhola shankar : టీ ట్వంటీ కాదు... టెస్ట్‌ మ్యాచ్‌ ఆడుతున్నా!

ABN , First Publish Date - 2023-08-04T03:04:08+05:30 IST

‘‘నా కెరీర్‌లో ఏదీ నేను ప్లాన్‌ చేసుకోలేదు. నా దగ్గరకు వచ్చిన సినిమాల్లో మంచివే ఎంచుకొంటున్నా. ఈ ప్రయాణంలో ‘భోళాశంకర్‌’ నాకు మర్చిపోలేని అనుభవం మిగిల్చింద’’న్నారు సుశాంత్‌...

Bhola shankar : టీ ట్వంటీ కాదు... టెస్ట్‌ మ్యాచ్‌ ఆడుతున్నా!

‘‘నా కెరీర్‌లో ఏదీ నేను ప్లాన్‌ చేసుకోలేదు. నా దగ్గరకు వచ్చిన సినిమాల్లో మంచివే ఎంచుకొంటున్నా. ఈ ప్రయాణంలో ‘భోళాశంకర్‌’ నాకు మర్చిపోలేని అనుభవం మిగిల్చింద’’న్నారు సుశాంత్‌. అక్కినేని కుటుంబం నుంచి వచ్చిన మరో హీరో సుశాంత్‌. కథానాయకుడిగా రాణిస్తూనే, క్యారెక్టర్‌ ఆర్టిస్టు పాత్రల్లోనూ మెరుస్తున్నారు. ‘భోళా శంకర్‌’తో కీర్తి సురేశ్‌కి జోడీగా నటించారు. ఈనెల 11న ‘భోళా..’ విడుదల అవుతున్న సందర్భంగా సుశాంత్‌ చెప్పిన కబుర్లు ఇవీ...

  • ‘‘అందరూ టీ ట్వంటీలు ఆడుతుంటే, నేనేమో టెస్టు మ్యాచ్‌లా నెమ్మదిగా నా ఇన్నింగ్స్‌ని నిర్మించుకొంటూ వస్తున్నా. ఆ ప్రయాణంలో ‘భోళా శంకర్‌’ ఎదురవ్వడం నా అదృష్టం. చిన్నప్పటి నుంచీ చిరంజీవి గారినీ, ఆయన డాన్సుల్నీ చూస్తూ పెరిగాను. చిత్రలహరిలో చిరు పాటలొస్తే.. రికార్డు చేసుకొని మరీ మళ్లీ మళ్లీ చూసేవాడ్ని. అలాంటిది ఆయన పక్కన స్టెప్పులేయడం నిజంగా మర్చిపోలేని అనుభవం. ఈ సినిమాలో నాది ఓ రకంగా అతిథి పాత్రలాంటిదే. అయినా సరే, ఓ పూర్తి స్థాయి సినిమా చేసినంత ఆనందంగా ఉంది’’.

  • కళ్లన్నీ చిరుపైనే ‘‘సంగీత్‌ పాటలో చిరంజీవిగారు, తమన్నా, కీర్తి, నేనూ కలిసి డాన్స్‌ చేశాం. డాన్స్‌లో చిరంజీవి గారి గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏముంది? ఆయనకు రిహార్సల్స్‌ కూడా అవసరం లేదు. తమన్నా కూడా అంతే. ‘దసరా’ సినిమాలో కీర్తి డాన్స్‌ అదరగొట్టింది. నేను డాన్స్‌ చేసి చాలాకాలమైంది. అందుకే వాళ్లకంటే నేనే ఎక్కువగా శ్రమించా. తెరపై పాట వస్తే అందరి కళ్లూ చిరంజీవిగారిపైనే ఉంటాయి. కానీ.. మేం నలుగురూ కలిసి స్టెప్పేసిన దృశ్యం కూడా చాలా కలర్‌ఫుల్‌గా, అందంగా వచ్చింది’’.

Updated Date - 2023-08-04T03:04:08+05:30 IST